Quote:

Wednesday, September 6, 2017

గణేషుడి_నిమర్జనం


గణేషుడి_నిమర్జనం

ఒంగి ఒంగి దండం పెట్టనోడంటూ ఉండడు కదా ఈ వేళ !!

ఊపు లేని వోడు కూడా ఊగి పోదురు ఈ వేళ,
శివతాండవమా కాదు అది 'తీన్మార్ 'దరువులంటూ పాదములు కదలాడు వేళ,
ఏటేటా 'జన'సాగరమే ఓ అలగా "హుస్సేన్ సాగర...మదిని" తాకే వేళ,
గంగమ్మ వొడి గణపయ్య చేరునట్టి వేళ,
ఇంతకు మించిన శోభయాత్రకు మరోకటి ఉండదు కదా ఈ వేళ-మరి ఏ వేళ.
-o-o-o-o-
-RSR-


Tuesday, February 14, 2017

ప్రేమకు ప్రేమతో......... నేను (మీ, ఆర్.ఎస్.ఆర్)


        నీవు- నేను


అందానికి నిర్వచనం నీవే అనుకున్నది నేను,

నాకు అందానికి అర్ధం తెలియదనుకున్నది నీవు,

నీ-మనసంతా ప్రేమమయమని అనుకున్నది నేను,
నాకు ఒక మనసు ఉంటదని ఉహించనే లేదు నీవు,

నా ప్రేమ భారం మోయగలవని ఆశించింది నేను,
ప్రేమంటే తేలిక కాదు అంటూ తీసి వేసింది నీవు, 

నీలో అన్ని ఉన్నాయని  భావించింది నేను,
నాలో  ఏమి లేవని ఊహించింది నీవు,

ఉంది-లేదు అని లెక్కలు వేసే మెందుకు నీవు-నేను?
ప్రేమంటేనే 'లాభం',కలసి పంచుకోమెందుకు నీవు- నేను?? 

-RSR-

Monday, January 16, 2017

సరదాల సంక్రాంతి

సరదాల సంక్రాంతి 
గడప గడపను కలుపుతున్నట్టు,
రంగవల్లులు గొలుసుకట్టు ,
నిండైన అమ్మమ్మ  చీర కట్టు,నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు, 
మనసు లాగేసరో! అమ్మ చేతి అరిసెల, జంతికల చుట్టు,
పెరడులో విరగబూసిన కారపుబంతి చెట్టు,
బంధుత్వాల కలగలుపులో బావ,మరదలిదే సరైన జట్టు ,
వెరసి అనిపించే కదా ! సిరిసంపదల నిలయం మా ఇల్లే అనేట్టు ,
'పల్లె ' గాలి పిలిచే పద పదమని అల్లరి చేసేట్టు ,
పడుచు అందాలు కనువిందు చేసే కదా ! అడుగులు  తడబడెట్టు,
కోడి పందాలు సాగే మా పౌరుషాల రుచి చూపెట్టు ,
ఇన్నాళ్ళ  పేచిలు ఇక ఈ పతంగితో  పెంఛ్ః కట్టు, 
ఊరు వాడ దద్దరిల్లే కదా ! "జోష్ " అంటే కుర్రకారుదనేట్టు ,
ఈ సరదా సంక్రాంతి ఏదో మాయ చేసేరా ?.......
అందరిని ఊరు చేరేట్టు. 
-RSR-

Friday, October 7, 2016

                                         బంగారు బతుకమ్మ                                          -                                          -----**------


తెలుగు బాషాకు యాసలు లెన్నెనో,
"కోల్" అంటూ సాగే కోలాటాల పలుకులులెన్నెనో,
తెలం'గాణం'లో దాగిన జానపదంగా ,
"పల్లెపాటలందే దాగి ఉంది " తెలుగు సంస్కృతి " పదిలంగ,
ఆటాపాటలే నోమన్నట్టు ఆ "గౌరమ్మను" కొలువంగ,
గడప-గడపన వెల్లి విరిసే కదా పండిన నోమువోలె బంగారు బతుకమ్మ .
                           -O-O-O-O

అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు.
RSR-       

Tuesday, April 12, 2016

           


             ఉగాది చెప్పే సత్యం
 
        **---**---**---**--**
ఉగాది వచ్చింది, వస్తూ ఏమి తెచ్చిందని ప్రశ్నించకు ,
తెచ్చిందేదో తీసుకో ,వద్దనుకున్నది నేటితో వదులుకో,        
ఇప్పుడు కాదనుకున్నవో మరో అవకాశం ఎన్నడో,
అసలే  అధిక  జనాభా గల దేశం ,
అరకొర అవసరాలు, ఆర్భాటలే జీవన విధానం,
ఇది 'మానవ-అభివృద్ధి' సూచిలో పెద్ద అవరోధం,
నిజానికి సంక్షోభాల నుండి గట్టేకించిన అత్యధిక ప్రజల 'పొదుపు పధకం',
కొత్తకు-పాతకు మధ్య నుండు ఎప్పుడు అగాధం,  
సంస్కరణోద్యమాల వల్ల రాజు-పేదకు
మధ్య పెరిగెను మరింత ఆర్ధిక దూరం ,
కొత్త కొలతలు నేర్చుకున్న నేటి ఈ జనం,
అభివృద్ధి అంటే ప్రతిది "గజం"గా కొలిచేయడం ,
'ఈ-కార్డు' వల్ల ముందే అప్పు పుట్టి,
తరువాత బొప్పి కట్టించే చందం,
నేటి ఈ కొత్తదనం రేపటికి పాతే,
నిన్నటి పాత మొన్నట్టికి కొత్తే,  
ఆర్భాటాల వల్ల కలిగే 'అవమానం' కన్నా,
అరకోరైన సంతృప్తి నిచ్చే 'రాజ్యపుజ్యం' మిన్న,
అవరోధాలు నిరోధించే చక్కటి ఉపాయం,
షడ్రుచులతో సమపాళ్ళుగా  పొల్చిచూపే సమ్మేళనం,
    ఈ ఉగాది పర్వదినం మనకు చెప్పే సత్యం.
         -O-O-O-O-      


-#RSR-

Sunday, January 17, 2016

భోగ భాగ్యాల - పండుగ       భోగ భాగ్యాల - పండుగ
     ------------------------------
తెలతెలవారగనే  గోపెమ్మల సందడుల నడుమ-రంగవల్లులు తిర్చిదిద్దినాను,
తడవ తడవకు నీవు వస్తావని,నా ఈ వేడుక-
-చూస్తావని,
ఆ ఎదురుచూపులే నిట్టూర్పు లై   భోగి మంటలు  రాజేయగా చలి కాచుకొన్నాను,

పాలు నిండిన ముంతలో, చంద్రబింబం వంటి  ఓ మోము లీలగా కనువిందు చేస్తుంటే ,
అది నీవేనేమోనని తెగ సంబరపడినాను ,

వెతికితే దొరకని నీవు ,పిలిస్తే పలుకుతావేమోనని
మదురమైన  నీ పేరే జపిస్తూ ,ఆ అరమరికలో ఎంత తీపి ఆ ముంతలో చేర్చానో  కూడా నే మరిచాను,

నా వలపు తలంపు తెలిపేలా 
రాసులుగా నా ఇంట చేరిన ధాన్యం నుండి  గుప్పేడు గుప్పేడుగా   ముంతలో జాలు వార్చాను ,
ఎంత సంబరం చుట్టూ ముట్టినా నీ పిలుపు వినబడక ,
నాలో కలిగిన రుసరుసలు ఎంతటిదో అంత ద్రాక్ష ,జీళ్ళు లుగా రంగరించాను ,

భోగ్య భాగ్యాల నిదర్శనముగా నిలేచే నా చేతి పొంగలి,
మొదటగా నీకే నివేదించగా పట్టుకోచ్చాను ,
ఆశ్వాదించగా మనసే లేదా ?....
మరి వడి వడిగా  రావేరా ...  శిఖిపించ్ఛ  ధారి మురారి .
-RSR-

Thursday, October 29, 2015

#‎రైతన్నల_మూగనోము‬

#‎రైతన్నల_మూగనోము‬
  -----------**-----------
(ప )ఏడ తెద్దునమ్మా ఓ! బతుకమ్మా నీకు-
కొమ్మకొమ్మల, విరగబూసిన 'తంగెడి 'పువ్వు, |2|
పాలమూరు నే హేళన చేస్తూంటే కరువు నవ్వు. 
                           ||ఏడ తెద్దునమ్మా....||
(1) ఏండిన బీళ్ళు...
     ఆకాశంకేసి దీనంగా చూస్తూంటే,
     ఖాళీ చెరువులు...
     కప్పుల నోరు మూస్తూంటే,... .. 
                  ||ఏడ తెద్దునమ్మా....||
(2) ఎండిన బోర్లు ., దొరకని నీరు ,
     పొద్దు తోనే మెదలాయే అప్పుళ్ళోల పోరు ,
     మార్పు లేని కర్షకుని బ్రతుకు రూపు,... ..||ఏడ తెద్దునమ్మా....||
(3) మాట మార్చిన నేతల తీరు ,
     వంచించిన విధి తీర్పు ,
     కాడెద్దులకైన కాలం కలసి రాకపాయే,
    దళారుల చేతిలో అవి కళేబరాలుగా మూగబోయే ,
                                                          ||ఏడ తెద్దునమ్మా....||
(4) చేతికి రాని పంటలాయే ,
     ఆకాశాని అంటిన ధరల మంటలాయే ,
     పాడి పశువుల కైన 'తవుడు' లేకపాయే ,
     సక్కినాలు, సజ్జప్పాలు ఊసే మదిలో మెదలదాయే ,
     || ఏమీ నివేదింతునమ్మా ఓ! బతుకమ్మా నీకు..,  చాలి చాలని బ్రతుకులలో ఈ 'సద్ది బువ్వే' నివేదన నీకు. ||
(5) భరోసా లేని 'రైతన్నల' బ్రతుకు లలో,
     ఆవేదన నిండిన గుండెలతో ,
     నిస్తేజమవుతున్న అతని తనువు తో
     'కల కాలం బ్రతుకమని'...
     || ఎలా పాడగలనమ్మ ఓ! బతుకమ్మా ఇకనీతో..??  భరోసా లేని రైతన్నల బ్రతుకులలో  ||   ||2||

                                     -o-o-o-o-o-

-RSR-

Sunday, September 27, 2015

శరణు గణేశా!

శరణు గణేశా!
నిను ఎత్తగల నా తరమా ..??
       గజానునుడివై నీవు ఉండ,

నిను లాలించ నా భాగ్యమా ..??
      అంబాసుతుడి వై  గారాలు పోతుండ, 

నిను శాసించ నా ధైర్యమా ..??
   "నీవు ఎంతనే" అహం నీవే దండించుచుండ, 

మెండుగా కుడుములు నీకు నివేదించ నా వసమా ..??
   కొండంత అండగా ఎదురుగా నీవు కూర్చుండ,

బలిమితో గాకున్నాచెలిమితోనైన నిను గెలువ వలేనని నే దీక్ష బూనిఉండ,

ఎటేట భక్తితో మా ఇంట శరణు గణేశానని వేడంగ,నిలుపంగా,కోలువంగా,

నన్నెంచి,హర్షించి ,కరుణించి "నీవుగా దయతో" నను బ్రోవుటకు తరలి రాకున్న,

నిన్నూ మెప్పించ నా శక్యమా..? లోకనాయక ! ఓ గణాధిపా .

            ^^^శరణు శరణు గణేశ,రక్ష రక్ష గణేశ^^^
-RSR-

Sunday, July 5, 2015

              పాలన వైవిధ్యం
            -----------------------
  
అశోకుడు చెట్లు నాటించెను, 

'హరితహారం'గా తెలంగాణలో 'కెసిఆర్' దానిని కొనసాగించెను,

 ఇక్కడి ప్రజలు ఈ మంచిపని చూసి సంతసించెను, 

'రాజధాని' పేరిట ఆంధ్ర లో పచ్చని పొలాలు 'బాబు' పెకిలించెను, 

ఇదేమి నిర్వాకం అని  అక్కడి జనం దుఃఖించెను,  

"ప్రజారంజక-పాలన " అంటే... 

కొందరు ఉద్యమాల ద్వార లభించునని ఉద్ఘటించెను,

కొందరు నోట్లకు వోట్ రాలునని భావించెను. 

Thursday, June 4, 2015


మౌనం ఒక శాపం

నీ పేరే అహర్నిశలు జపించా,
నీ కోసమే ఐహిక అవకాశాలు త్యజించా,

నీ కోసం ఎన్నో అవమానాలు భరించా,
నీ కోన చూపుకై తపించా,

నీవే ఊపిరిగా శ్వాసించా,
నీవే నేననుకొని జీవించా ,

అయిన కరగని ఈ నిరీక్షణలో,
తరగని ఆ... వేదనలో,

ఇంకను,చెలించని ఓ ! హృదయంలా,
వీడని పంతం లా ,

ఈ ఒంటరి, జీవితాని నాకు బహుమతిగా పంచవా ??
  ......ఓ!నా ప్రేమా ....,
వరమల్లే దరిచేరిన ఒక శాపమా,
మౌనమే ఈ నాటికి నీ సమాధానమా .
        -*-*-*-*-

Wednesday, June 3, 2015

#JUNE_2nd


#June_2nd

☆★
కొందరికి నేడు ఆవిర్భావం, 
మరికొందరికి  నేడు  ఆవిరైన 'సమైఖ్య నాదం',

కొందరికి ఇది నవ నిర్మాణం కాలం,
మరికొందరికి ఇది ఏండమావులకై  ఎదురితే కాలం,

కొందరు నేడు గెలిచి మురుస్తూ, తెలిసి సాగిస్తూ న్నా ఓంటరి ప్రయాణం, 
చెదిరిన గూడు ని మరికొందరు మనోస్థైర్యం ప్రదర్శిస్తూ సాగించే  మరో ప్రస్థానం, 

కొందరి  నేడు శుభోదయం, 
మరికొందరి పాలిట శరాఘతం,

ఒకరి  కంటిలో బెల్లం, మరో కంటిలో సున్నం,
 పెట్టించుకున్నా ఓ! తెలుగోడి వింత రాజకీయ పంతం,

వెరసి,60 ఏళ్ళ వెనుకబడిన మెట్ట మెదటి ఆంధ్ర రాష్ట్రం, 
ఆ అనుభవ సారం కొనసాగింపే తెలంగాణ మనదేశపు చివరి రాష్ట్రం. 

'కపిరాజు' లేక వెలవెలబోతున్నా తెలుగోడి జెండాకు! నేడు వందనోత్సవం,
ప్రేమలు కనుమరుగై , కక్షలు కొనసాగింపుతో ఏవరికి వారే -
          -పాలపుంత తాకాలనే ఆరభాటాల వింతైన స్నేహ బంధం.

-RSR-

Sunday, July 21, 2013

కాశి పట్టణం చూడరా బాబు

కాశీ పట్నం చూడర బాబు  
కాశీ పట్నం  చూడర బాబు, 
నేటి దుస్థితికి కారణం ఏవరు ?
 ధర్మం విడనాడిన నాడు ,
 ప్రకృతి వీలయ తాండవంలో 'విగత జీవి'గా మిగిలితివి చూడు ,  
"నిజ భక్తి" లేక ముక్తి లభించదు ఎన్నడు ,
 నిర్లక్ష్యం  ఇకనైనా విడనాడ రా ..బాబు,
శక్తి పీఠాలుతోటే  చేలగాటం ఆడే 'వెర్రితల' ఎలా పెంచుకొంటివి రా... నీవు??
||కాశీ ||           
            అ గంగమ్మా తల్లి మన తప్పు కాయునా ?
            ఇక ఆ జంగమ దేవర! మన ప్రార్ధన వినునా?
            నిర్మల భక్తి కనుమరుగైనది కదా  నేడు,
            సాధు, సంతులు లేని 'కేదారిని' చూడు, 
            నిజ తత్వ చింతన ఇంకెక్కడా దొరికును రా.. బాబు ?
            పవిత్ర యాత్రను 'విహార' యాత్ర గా మార్చేసింది ..ఏవరు?
||కాశీ ||
             'నేను' లోని  అహం, 'నీవు' అనే సగం , 
             కలగలసిన ఒక వైరాస్య తప్పిదం,
             కాదు అనలేని కారణాలు అనేకం , 
             కనుల ముందు నిలిచినా ఒక నిలువెత్తు నిదర్శనం.  
-#RSR-
            --------------------------o-o-o-o-----------------------------------
            

Wednesday, June 26, 2013

రాజకీయం

రాజకీయం దండగా అనుకునే వారికి నా మనసులోని మాట మాత్రమే సుమా!

Sunday, March 31, 2013

నీవు లేని వసంతోత్సవం

           

           నీవు లేని వసంతోత్సవం

దరిచెరని ఓ! ప్రణయమా,
      నీ తొడు లేని ఈ 'వసంతొ్త్సవం' ఎలా జరిగిందో నీకు తెలుసునా??
నా ఊపిరిలో నీ తలపు నింపగా,
    'పచ్చని రంగు' అందుకు సాక్షిగా మొదటిగా నన్ను తాకింది,
నీ పేరు నే పిలువగా ,
    నాలో నీ ఉనికిని చాటుతూ, 'గులారా' నా పెదవుల పై చేరింది,
నా కనుపాపలలో నీ రూపే మెదలాడగా,
       ఈ నింగి,నేల అంతట నీవేనంటూ ..ఆ 'నీలి' రంగు నా పై చిరుజల్లై  కురిసింది,

ప్రతి రంగులోను ,నీ పై నా 'ఆశ' జాలువారగా,
              'ఇంద్రధనస్సు ' వలే నా మేను మెరిసింది,
నీవు లేక ,నీవు రాక ఈ వసంతం ఇలా గడచినా,
నిన్ను 'వలచి' ఒంటరినై  నే  మిగిలినా,
 'గెలిచి' మరు జన్మలో 'పరువమై' నిన్ను చేరనా???
నూరేళ్ళ నేటి వసంతాలు,నాడు నావేనని తెలుపనా...ఓ ప్రాణమా!,దరిచెరని నా ప్రణయమా.-#RSR-

Monday, December 24, 2012

మాయ భవిష్య వాణీ

నేను జీవించాలి అంటుకుంటే ,
ఈ ప్రపంచమే అంతిమ గడియలు లెక్కిస్తుంది అని మాయ భవిష్య వాణీ పలికింది
,
నేను నిస్తేజం అవ్వాలి అనుకుంటే,
ఆ మాయ లెక్కలు తేలేవరకు సెలవు లేదుంటున్నది,

ఈ మాయ ఏమో కాని ,
కాలమనే అద్దం లో నన్ను నాకు సరి కోతగా చూపిస్తున్నది ,
జీవించాలి అనే భావనలో 'వికృతి రూపం' తోను,
నిస్తేజం అవ్వాలి అనే భావనలో 'ప్రశాంతమైన అందం' తో నా రూపం అగుపడుతున్నది.

Monday, September 3, 2012

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికిబృందావనంలో నేడు 'కన్నయ్య' ఉంటాడని,
నమ్మి కొలిచేదరు ప్రతి ఇంటి ఇల్లవేల్పు  నీవేనని,

ఉట్టి కొట్టిన,వసంత కేళి ఆడినా
,
కస్తూరి తిలకం దిద్దిన
, వెన్న ముద్ద లు  నివేదించినా ,ఏటేటా నిన్నే దరిచేరి కొలిచినా,

" నన్ను" బంధింప గల అస్త్రం  భక్తి తో నిండిన మీ 'మనసే' అని మాకు తెలియజేస్తూనే 
తీరని తృష్ణ మా మనసులలో  మిగిలి ఉంచగలిగే ,

దివ్య మనోహర రూపం నీదే కదా ఓ! నా  స్వామి ?
మరి జాగుసెయ్యక ,మము తరింప చెయ్యగా  రా....వేరా.. యమునా తటికి
ఓ ! మురారి ,మరో సారి ..