Quote:

Sunday, March 31, 2013

నీవు లేని వసంతోత్సవం

           

           నీవు లేని వసంతోత్సవం

దరిచెరని ఓ! ప్రణయమా,
      నీ తొడు లేని ఈ 'వసంతొ్త్సవం' ఎలా జరిగిందో నీకు తెలుసునా??
నా ఊపిరిలో నీ తలపు నింపగా,
    'పచ్చని రంగు' అందుకు సాక్షిగా మొదటిగా నన్ను తాకింది,
నీ పేరు నే పిలువగా ,
    నాలో నీ ఉనికిని చాటుతూ, 'గులారా' నా పెదవుల పై చేరింది,
నా కనుపాపలలో నీ రూపే మెదలాడగా,
       ఈ నింగి,నేల అంతట నీవేనంటూ ..ఆ 'నీలి' రంగు నా పై చిరుజల్లై  కురిసింది,

ప్రతి రంగులోను ,నీ పై నా 'ఆశ' జాలువారగా,
              'ఇంద్రధనస్సు ' వలే నా మేను మెరిసింది,
నీవు లేక ,నీవు రాక ఈ వసంతం ఇలా గడచినా,
నిన్ను 'వలచి' ఒంటరినై  నే  మిగిలినా,
 'గెలిచి' మరు జన్మలో 'పరువమై' నిన్ను చేరనా???
నూరేళ్ళ నేటి వసంతాలు,నాడు నావేనని తెలుపనా...ఓ ప్రాణమా!,దరిచెరని నా ప్రణయమా.



-#RSR-