Quote:

Tuesday, February 15, 2011

తెలుగుతల్లి కన్నీరు
తెలుగు తల్లి నేడు సందిగ్ధం లో ఉన్నది ,

ఎ ' బిడ్డ'కు ఎమోతుందో అని ఆరాటపడుతున్నది,


అన్నదమ్ముల ఈ పోరు మళ్ళి రేపింది ఎవరని?


నాటి భారత యుద్ధం తో నేర్చినది ఎమైనదని?


వీరులమన్న ,శురులమన్న ,బంధించిన తన ప్రేమ లో తేడాలేదన్నది ,


అన్నదమ్ములం నాడన్నా, ఉ ద్యమకారులం నేడన్న, పేరు మార్చి పిలుస్తున్న


- ఆత్మర్పనులు చేసుకున్న అన్యాయం జరిగేది తనకేనన్నది ,


ప్రయోజనం లేని ఉద్యమాల వల్ల ఒరిగేదేమున్నది ?


'స్వార్ధపరుల' ఓటమి ముందుంది చూడమన్నది

-----------సుధా రాణి .

నేస్తమా !ఇదే నీ వైనమా?

నేస్తమా !ఇదే నీ వైనమా?
                          -*-*-*-*-*-*-*-*-*-*-

స్నేహమనే సముద్రం లో నీవు ఒక చిన 'చేపవని ' అనుకున్నా,
అలల తాకిడికి నా తిరం చేరవనే భావించా,

కానీ రోజు నన్ను మరిచిపోయే నీ 'వైనం' జెల్లి ఫిష్తో పోలుస్తున్న,
అంది-అందని నీ స్నేహం' కొరమీను 'లా గుచ్చుతున్నదని చెబుతున్నా,

ఇతరులతో నన్ను  పోల్చే 
నీ తిరు మదిలో అలజడులు రెపుతున్నా,
నిన్ను అద్దాల సౌదంలో ఉంచాలనే కోరుకున్న ,
అందుకే 'కాలమనే'  చేపను, నీవు మింగేసినా నేను ఏమి చేయలేకున్నా,
సముద్రం మధ్య ఉండే నీకు, తిరం వెంబడి ఉన్న నాకు మధ్య 'దూరం' ఎంతో కొలవలేకున్నా,
వెనుదిరగాలని అనుకున్నా,నిరీక్షణం  అర్ధం మారుతున్నా,
ఏదైనా  వలలో చిక్కుకున్నావేమోనని  దారి వెంబడి వెతుకుతున్నా,
నేస్తమా! అని నీవు పిలిచావేమోనని అడుగు అడుగున ఇంకా ఆగుతున్నా.

                        -*-*-*-*-