ప్రేమికుల రోజు
గాలిలో నేనై ఉండగా,
నీ మోము తాకకుండా ఆపకు,
తీయని రాగ మై నేను వినిపిస్తుంటే,
శృతి మార్చాలని చూడకు,
నేనుగా ఎదురై వస్తుంటే,
నేను ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోకు,
నా కోరకై ఉబలాటపడుతున్నావు,
ఇంతకి నీవు ఎవరని అడగకు,
నేను 'ప్రేమ'ను అనగానే,
నా చిరునామాకై వెతుకకు,
ఎన్నాళ్ళోగా నీ హృదయ తలపు తడుతున్నాను,
ఈ రోజైన నన్ను ఆహ్వానించటం మరువకు
.... ఎందుకంటే నేను నీ ప్రేమను.

