నీవు- నేను
అందానికి నిర్వచనం నీవే అనుకున్నది నేను,
నాకు అందానికి అర్ధం తెలియదనుకున్నది నీవు,
నీ-మనసంతా ప్రేమమయమని అనుకున్నది నేను,
నాకు ఒక మనసు ఉంటదని ఉహించనే లేదు నీవు,
నా ప్రేమ భారం మోయగలవని ఆశించింది నేను,
ప్రేమంటే తేలిక కాదు అంటూ తీసి వేసింది నీవు,
నీలో అన్ని ఉన్నాయని భావించింది నేను,
నాలో ఏమి లేవని ఊహించింది నీవు,
ఉంది-లేదు అని లెక్కలు వేసే మెందుకు నీవు-నేను?
ప్రేమంటేనే 'లాభం',కలసి పంచుకోమెందుకు నీవు- నేను??
-RSR-