Quote:

Thursday, October 29, 2015

#‎రైతన్నల_మూగనోము‬

#‎రైతన్నల_మూగనోము‬
  -----------**-----------
(ప )ఏడ తెద్దునమ్మా ఓ! బతుకమ్మా నీకు-
కొమ్మకొమ్మల, విరగబూసిన 'తంగెడి 'పువ్వు, |2|
పాలమూరు నే హేళన చేస్తూంటే కరువు నవ్వు. 
                           ||ఏడ తెద్దునమ్మా....||
(1) ఏండిన బీళ్ళు...
     ఆకాశంకేసి దీనంగా చూస్తూంటే,
     ఖాళీ చెరువులు...
     కప్పుల నోరు మూస్తూంటే,... .. 
                  ||ఏడ తెద్దునమ్మా....||
(2) ఎండిన బోర్లు ., దొరకని నీరు ,
     పొద్దు తోనే మెదలాయే అప్పుళ్ళోల పోరు ,
     మార్పు లేని కర్షకుని బ్రతుకు రూపు,... ..||ఏడ తెద్దునమ్మా....||
(3) మాట మార్చిన నేతల తీరు ,
     వంచించిన విధి తీర్పు ,
     కాడెద్దులకైన కాలం కలసి రాకపాయే,
    దళారుల చేతిలో అవి కళేబరాలుగా మూగబోయే ,
                                                          ||ఏడ తెద్దునమ్మా....||
(4) చేతికి రాని పంటలాయే ,
     ఆకాశాని అంటిన ధరల మంటలాయే ,
     పాడి పశువుల కైన 'తవుడు' లేకపాయే ,
     సక్కినాలు, సజ్జప్పాలు ఊసే మదిలో మెదలదాయే ,
     || ఏమీ నివేదింతునమ్మా ఓ! బతుకమ్మా నీకు..,  చాలి చాలని బ్రతుకులలో ఈ 'సద్ది బువ్వే' నివేదన నీకు. ||
(5) భరోసా లేని 'రైతన్నల' బ్రతుకు లలో,
     ఆవేదన నిండిన గుండెలతో ,
     నిస్తేజమవుతున్న అతని తనువు తో
     'కల కాలం బ్రతుకమని'...
     || ఎలా పాడగలనమ్మ ఓ! బతుకమ్మా ఇకనీతో..??  భరోసా లేని రైతన్నల బ్రతుకులలో  ||   ||2||

                                     -o-o-o-o-o-

-RSR-