Quote:
Friday, January 22, 2016
Sunday, January 17, 2016
భోగ భాగ్యాల - పండుగ
భోగ భాగ్యాల - పండుగ
------------------------------
తెలతెలవారగనే గోపెమ్మల సందడుల నడుమ-రంగవల్లులు తిర్చిదిద్దినాను,
తడవ తడవకు నీవు వస్తావని,నా ఈ వేడుక-
-చూస్తావని,
ఆ ఎదురుచూపులే నిట్టూర్పు లై భోగి మంటలు రాజేయగా చలి కాచుకొన్నాను,
పాలు నిండిన ముంతలో, చంద్రబింబం వంటి ఓ మోము లీలగా కనువిందు చేస్తుంటే ,
అది నీవేనేమోనని తెగ సంబరపడినాను ,
అది నీవేనేమోనని తెగ సంబరపడినాను ,
వెతికితే దొరకని నీవు ,పిలిస్తే పలుకుతావేమోనని
మదురమైన నీ పేరే జపిస్తూ ,ఆ అరమరికలో ఎంత తీపి ఆ ముంతలో చేర్చానో కూడా నే మరిచాను,
మదురమైన నీ పేరే జపిస్తూ ,ఆ అరమరికలో ఎంత తీపి ఆ ముంతలో చేర్చానో కూడా నే మరిచాను,
నా వలపు తలంపు తెలిపేలా
రాసులుగా నా ఇంట చేరిన ధాన్యం నుండి గుప్పేడు గుప్పేడుగా ముంతలో జాలు వార్చాను ,
ఎంత సంబరం చుట్టూ ముట్టినా నీ పిలుపు వినబడక ,
నాలో కలిగిన రుసరుసలు ఎంతటిదో అంత ద్రాక్ష ,జీళ్ళు లుగా రంగరించాను ,
భోగ్య భాగ్యాల నిదర్శనముగా నిలేచే నా చేతి పొంగలి,
మొదటగా నీకే నివేదించగా పట్టుకోచ్చాను ,
మొదటగా నీకే నివేదించగా పట్టుకోచ్చాను ,
ఆశ్వాదించగా మనసే లేదా ?....
మరి వడి వడిగా రావేరా ... శిఖిపించ్ఛ ధారి మురారి .
మరి వడి వడిగా రావేరా ... శిఖిపించ్ఛ ధారి మురారి .
-RSR-
Thursday, October 29, 2015
#రైతన్నల_మూగనోము
#రైతన్నల_మూగనోము
-----------**-----------
-----------**-----------
(ప )ఏడ తెద్దునమ్మా ఓ! బతుకమ్మా నీకు-
కొమ్మకొమ్మల, విరగబూసిన 'తంగెడి 'పువ్వు, |2|
పాలమూరు నే హేళన చేస్తూంటే కరువు నవ్వు.
కొమ్మకొమ్మల, విరగబూసిన 'తంగెడి 'పువ్వు, |2|
పాలమూరు నే హేళన చేస్తూంటే కరువు నవ్వు.
||ఏడ తెద్దునమ్మా....||
(1) ఏండిన బీళ్ళు...
ఆకాశంకేసి దీనంగా చూస్తూంటే,
ఖాళీ చెరువులు...
కప్పుల నోరు మూస్తూంటే,... ..
ఆకాశంకేసి దీనంగా చూస్తూంటే,
ఖాళీ చెరువులు...
కప్పుల నోరు మూస్తూంటే,... ..
||ఏడ తెద్దునమ్మా....||
(2) ఎండిన బోర్లు ., దొరకని నీరు ,
పొద్దు తోనే మెదలాయే అప్పుళ్ళోల పోరు ,
మార్పు లేని కర్షకుని బ్రతుకు రూపు,... ..||ఏడ తెద్దునమ్మా....||
పొద్దు తోనే మెదలాయే అప్పుళ్ళోల పోరు ,
మార్పు లేని కర్షకుని బ్రతుకు రూపు,... ..||ఏడ తెద్దునమ్మా....||
(3) మాట మార్చిన నేతల తీరు ,
వంచించిన విధి తీర్పు ,
కాడెద్దులకైన కాలం కలసి రాకపాయే,
దళారుల చేతిలో అవి కళేబరాలుగా మూగబోయే ,
||ఏడ తెద్దునమ్మా....||
వంచించిన విధి తీర్పు ,
కాడెద్దులకైన కాలం కలసి రాకపాయే,
దళారుల చేతిలో అవి కళేబరాలుగా మూగబోయే ,
||ఏడ తెద్దునమ్మా....||
(4) చేతికి రాని పంటలాయే ,
ఆకాశాని అంటిన ధరల మంటలాయే ,
పాడి పశువుల కైన 'తవుడు' లేకపాయే ,
సక్కినాలు, సజ్జప్పాలు ఊసే మదిలో మెదలదాయే ,
ఆకాశాని అంటిన ధరల మంటలాయే ,
పాడి పశువుల కైన 'తవుడు' లేకపాయే ,
సక్కినాలు, సజ్జప్పాలు ఊసే మదిలో మెదలదాయే ,
|| ఏమీ నివేదింతునమ్మా ఓ! బతుకమ్మా నీకు.., చాలి చాలని బ్రతుకులలో ఈ 'సద్ది బువ్వే' నివేదన నీకు. ||
(5) భరోసా లేని 'రైతన్నల' బ్రతుకు లలో,
ఆవేదన నిండిన గుండెలతో ,
నిస్తేజమవుతున్న అతని తనువు తో
'కల కాలం బ్రతుకమని'...
|| ఎలా పాడగలనమ్మ ఓ! బతుకమ్మా ఇకనీతో..?? భరోసా లేని రైతన్నల బ్రతుకులలో || ||2||
నిస్తేజమవుతున్న అతని తనువు తో
'కల కాలం బ్రతుకమని'...
|| ఎలా పాడగలనమ్మ ఓ! బతుకమ్మా ఇకనీతో..?? భరోసా లేని రైతన్నల బ్రతుకులలో || ||2||
-RSR-
Sunday, September 27, 2015
శరణు గణేశా!
శరణు గణేశా!
నిను ఎత్తగల నా తరమా ..??
గజానునుడివై నీవు ఉండ,
నిను లాలించ నా భాగ్యమా ..??
అంబాసుతుడి వై గారాలు పోతుండ,
నిను శాసించ నా ధైర్యమా ..??
"నీవు ఎంతనే" అహం నీవే దండించుచుండ,
మెండుగా కుడుములు నీకు నివేదించ నా వసమా ..??
కొండంత అండగా ఎదురుగా నీవు కూర్చుండ,
బలిమితో గాకున్నాచెలిమితోనైన నిను గెలువ వలేనని నే దీక్ష బూనిఉండ,
ఎటేట భక్తితో మా ఇంట శరణు గణేశానని వేడంగ,నిలుపంగా,కోలువంగా,
నన్నెంచి,హర్షించి ,కరుణించి "నీవుగా దయతో" నను బ్రోవుటకు తరలి రాకున్న,
నిన్నూ మెప్పించ నా శక్యమా..? లోకనాయక ! ఓ గణాధిపా .
^^^శరణు శరణు గణేశ,రక్ష రక్ష గణేశ^^^
-RSR-
Sunday, July 5, 2015
పాలన వైవిధ్యం
-----------------------
అశోకుడు చెట్లు నాటించెను,
'హరితహారం'గా తెలంగాణలో 'కెసిఆర్' దానిని కొనసాగించెను,
ఇక్కడి ప్రజలు ఈ మంచిపని చూసి సంతసించెను,
'రాజధాని' పేరిట ఆంధ్ర లో పచ్చని పొలాలు 'బాబు' పెకిలించెను,
ఇదేమి నిర్వాకం అని అక్కడి జనం దుఃఖించెను,
"ప్రజారంజక-పాలన " అంటే...
కొందరు ఉద్యమాల ద్వార లభించునని ఉద్ఘటించెను,
కొందరు నోట్లకు వోట్ రాలునని భావించెను.
Thursday, June 4, 2015
మౌనం ఒక శాపం
నీ పేరే అహర్నిశలు జపించా,నీ కోసమే ఐహిక అవకాశాలు త్యజించా,
నీ కోసం ఎన్నో అవమానాలు భరించా,
నీ కోన చూపుకై తపించా,
నీవే ఊపిరిగా శ్వాసించా,
నీవే నేననుకొని జీవించా ,
అయిన కరగని ఈ నిరీక్షణలో,
తరగని ఆ... వేదనలో,
ఇంకను,చెలించని ఓ ! హృదయంలా,
వీడని పంతం లా ,
ఈ ఒంటరి, జీవితాని నాకు బహుమతిగా పంచవా ??
......ఓ!నా ప్రేమా ....,
వరమల్లే దరిచేరిన ఒక శాపమా,
మౌనమే ఈ నాటికి నీ సమాధానమా .
-*-*-*-*-
Wednesday, June 3, 2015
#JUNE_2nd
#June_2nd
☆★
కొందరికి నేడు ఆవిర్భావం,
మరికొందరికి నేడు ఆవిరైన 'సమైఖ్య నాదం',
కొందరికి ఇది నవ నిర్మాణం కాలం,
మరికొందరికి ఇది ఏండమావులకై ఎదురితే కాలం,
కొందరు నేడు గెలిచి మురుస్తూ, తెలిసి సాగిస్తూ న్నా ఓంటరి ప్రయాణం,
చెదిరిన గూడు ని మరికొందరు మనోస్థైర్యం ప్రదర్శిస్తూ సాగించే మరో ప్రస్థానం,
కొందరి నేడు శుభోదయం,
మరికొందరి పాలిట శరాఘతం,
ఒకరి కంటిలో బెల్లం, మరో కంటిలో సున్నం,
పెట్టించుకున్నా ఓ! తెలుగోడి వింత రాజకీయ పంతం,
వెరసి,60 ఏళ్ళ వెనుకబడిన మెట్ట మెదటి ఆంధ్ర రాష్ట్రం,
ఆ అనుభవ సారం కొనసాగింపే తెలంగాణ మనదేశపు చివరి రాష్ట్రం.
'కపిరాజు' లేక వెలవెలబోతున్నా తెలుగోడి జెండాకు! నేడు వందనోత్సవం,
ప్రేమలు కనుమరుగై , కక్షలు కొనసాగింపుతో ఏవరికి వారే -
-పాలపుంత తాకాలనే ఆరభాటాల వింతైన స్నేహ బంధం.
-RSR-
Monday, May 4, 2015
Monday, March 30, 2015
Monday, November 17, 2014
Tuesday, September 9, 2014
నీమజ్జనం
నిమజ్జనం
మా ముంగిటిల్లో కొలువుదీరిన ఓ! బొజ్జ గణపయ్యా !
నవరాత్రి ఉత్సవాలు నీకు మెండుగా చేసినామయ్యా !
నేడు నిమజ్జనం చేయ మాకు మనసు కూడా రాదయ్యా !
కాని,
తొలి పూజ అందుకొనగా, మా విఘ్నాలు తోలిగించగా, మళ్ళి ఏడు రావలెను కదయ్యా!
వెళ్ళి రావయ్యా ! ఓ గణాధిప ! మళ్ళి రావయ్యా !
అందాక,
ఉమాసుతుడవై అమ్మ ఆలనలో సేదతీరవయ్యా !
జై బోలో గణేష్ మహారాజ్ కి 'జై'.....
Friday, April 4, 2014
Thursday, March 13, 2014
Sunday, August 18, 2013
Sunday, July 21, 2013
కాశి పట్టణం చూడరా బాబు
కాశీ పట్నం చూడర బాబు
కాశీ పట్నం చూడర బాబు,
నేటి దుస్థితికి కారణం ఏవరు ?
ధర్మం విడనాడిన నాడు ,
ప్రకృతి వీలయ తాండవంలో 'విగత జీవి'గా మిగిలితివి చూడు ,
"నిజ భక్తి" లేక ముక్తి లభించదు ఎన్నడు ,
నిర్లక్ష్యం ఇకనైనా విడనాడ రా ..బాబు,
శక్తి పీఠాలుతోటే చేలగాటం ఆడే 'వెర్రితల' ఎలా పెంచుకొంటివి రా... నీవు??
||కాశీ ||
అ గంగమ్మా తల్లి మన తప్పు కాయునా ?
ఇక ఆ జంగమ దేవర! మన ప్రార్ధన వినునా?
నిర్మల భక్తి కనుమరుగైనది కదా నేడు,
సాధు, సంతులు లేని 'కేదారిని' చూడు,
నిజ తత్వ చింతన ఇంకెక్కడా దొరికును రా.. బాబు ?
పవిత్ర యాత్రను 'విహార' యాత్ర గా మార్చేసింది ..ఏవరు?
||కాశీ ||
'నేను' లోని అహం, 'నీవు' అనే సగం ,
కలగలసిన ఒక వైరాస్య తప్పిదం,
కాదు అనలేని కారణాలు అనేకం ,
కనుల ముందు నిలిచినా ఒక నిలువెత్తు నిదర్శనం.
-#RSR-
--------------------------o-o-o-o--- ------------------------------ --
Wednesday, June 26, 2013
Sunday, March 31, 2013
నీవు లేని వసంతోత్సవం
నీవు లేని వసంతోత్సవం
దరిచెరని ఓ! ప్రణయమా,
నీ తొడు లేని ఈ 'వసంతొ్త్సవం' ఎలా జరిగిందో నీకు తెలుసునా??
నా ఊపిరిలో నీ తలపు నింపగా,
'పచ్చని రంగు' అందుకు సాక్షిగా మొదటిగా నన్ను తాకింది,
నీ పేరు నే పిలువగా ,
నాలో నీ ఉనికిని చాటుతూ, 'గులారా' నా పెదవుల పై చేరింది,
నా కనుపాపలలో నీ రూపే మెదలాడగా,
ఈ నింగి,నేల అంతట నీవేనంటూ ..ఆ 'నీలి' రంగు నా పై చిరుజల్లై కురిసింది,
ప్రతి రంగులోను ,నీ పై నా 'ఆశ' జాలువారగా,
'ఇంద్రధనస్సు ' వలే నా మేను మెరిసింది,
నీవు లేక ,నీవు రాక ఈ వసంతం ఇలా గడచినా,
నిన్ను 'వలచి' ఒంటరినై నే మిగిలినా,
'గెలిచి' మరు జన్మలో 'పరువమై' నిన్ను చేరనా???
నూరేళ్ళ నేటి వసంతాలు,నాడు నావేనని తెలుపనా...ఓ ప్రాణమా!,దరిచెరని నా ప్రణయమా.
-#RSR-
Monday, December 24, 2012
మాయ భవిష్య వాణీ
నేను జీవించాలి అంటుకుంటే ,
ఈ ప్రపంచమే అంతిమ గడియలు లెక్కిస్తుంది అని మాయ భవిష్య వాణీ పలికింది ,
నేను నిస్తేజం అవ్వాలి అనుకుంటే,
ఆ మాయ లెక్కలు తేలేవరకు సెలవు లేదుంటున్నది,
ఈ మాయ ఏమో కాని ,
ఈ ప్రపంచమే అంతిమ గడియలు లెక్కిస్తుంది అని మాయ భవిష్య వాణీ పలికింది ,
నేను నిస్తేజం అవ్వాలి అనుకుంటే,
ఆ మాయ లెక్కలు తేలేవరకు సెలవు లేదుంటున్నది,
ఈ మాయ ఏమో కాని ,
కాలమనే అద్దం లో నన్ను నాకు సరి కోతగా చూపిస్తున్నది ,
జీవించాలి అనే భావనలో 'వికృతి రూపం' తోను,
నిస్తేజం అవ్వాలి అనే భావనలో 'ప్రశాంతమైన అందం' తో నా రూపం అగుపడుతున్నది.
జీవించాలి అనే భావనలో 'వికృతి రూపం' తోను,
నిస్తేజం అవ్వాలి అనే భావనలో 'ప్రశాంతమైన అందం' తో నా రూపం అగుపడుతున్నది.
Monday, September 3, 2012
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి
బృందావనంలో
నేడు 'కన్నయ్య' ఉంటాడని,
నమ్మి కొలిచేదరు ప్రతి ఇంటి ఇల్లవేల్పు నీవేనని,
ఉట్టి కొట్టిన,వసంత కేళి ఆడినా,
కస్తూరి తిలకం దిద్దిన, వెన్న ముద్ద లు నివేదించినా ,ఏటేటా నిన్నే దరిచేరి కొలిచినా,
" నన్ను" బంధింప గల అస్త్రం భక్తి తో నిండిన మీ 'మనసే' అని మాకు తెలియజేస్తూనే
తీరని తృష్ణ మా మనసులలో మిగిలి ఉంచగలిగే ,
దివ్య మనోహర రూపం నీదే కదా ఓ! నా స్వామి ?
మరి జాగుసెయ్యక ,మము తరింప చెయ్యగా రా....వేరా.. యమునా తటికి
ఓ ! మురారి ,మరో సారి ..
నమ్మి కొలిచేదరు ప్రతి ఇంటి ఇల్లవేల్పు నీవేనని,
ఉట్టి కొట్టిన,వసంత కేళి ఆడినా,
కస్తూరి తిలకం దిద్దిన, వెన్న ముద్ద లు నివేదించినా ,ఏటేటా నిన్నే దరిచేరి కొలిచినా,
" నన్ను" బంధింప గల అస్త్రం భక్తి తో నిండిన మీ 'మనసే' అని మాకు తెలియజేస్తూనే
తీరని తృష్ణ మా మనసులలో మిగిలి ఉంచగలిగే ,
దివ్య మనోహర రూపం నీదే కదా ఓ! నా స్వామి ?
మరి జాగుసెయ్యక ,మము తరింప చెయ్యగా రా....వేరా.. యమునా తటికి
ఓ ! మురారి ,మరో సారి ..
Friday, August 31, 2012
మరువరాని బంధం
నిన్ను చూస్తుంటే కవిత పొంగి పారేను ,
నీవు కానరాక పోతే...ఆ ఏరు నా
కన్నీరు అయ్యెను, నా ఏదో లోని భావాలన్నీ మల్లెలై విరబుసేను ,
నీ దోసిలిలో హారంగా చేరేవరకు అల్లాడి పోయేను,
నీవు చేరదీసిన వేల' "మనసైన బంధంగా'" ...
అల్లుక పోయేను,
నిరాధరణే నా భాగ్యమైన...ఎంతకి మిమ్ము వీడలేని...
...ఒక '"మరువరాని బంధం'" వోలె అనురాగ పరిమళానే సాధా నీకు పంచేను.
Monday, September 5, 2011
UGADI
రా... రామ్మనే యుగాదిసోయగం
'తియ్య'నైన తెలుగు పదం ,
అనాదిగా పంచుతున్నది మన పై మమ'కారం' ,
నేడు 'వగరు'గా అని పించే కదా 'ప్రాంతీయ విబేదం',
అయినా 'లవణం' గా కలసిపోగల 'యాసలలో నుడికారం',
'పులుపు'గా తెరపైకి వస్తున్న వైతాళికుల మనోభావం,
'చేదు'గా కూడా ఉంటుందని గుర్తుచేసిన "వికృతినామం",
ఈ షడ్రుచుల సోపానం ,
మళ్ళి దరిచేరినది నవ వసంత కోకిల గానం ,
చిగురించే గా సరికొత ఆశాభావం ,
రా ....రమ్మని పిలిచే 'రాజయోగం',
లేక్కలు రాకున్న ఎంతుందో తెలుపగల 'ఆదాయల వ్యయ్యం',
ప్రమయం లేకున్నా వెంటాడే 'అవమానం' ,
'నవరత్నా'లతో మారిపోవు 'జాతక చక్రం',
గడియ,విఘడియలు తేడా చేపగల "శ్రీ ఖరనామం" ,
మన 'భవిషవాణి' ఏమి పలుకునో కదా తెలుగు వారికే సొంతమైన -'ఉగాది పంచాంగం'.
ఉగాది శుభాకాంక్షలు
'తియ్య'నైన తెలుగు పదం ,
అనాదిగా పంచుతున్నది మన పై మమ'కారం' ,
నేడు 'వగరు'గా అని పించే కదా 'ప్రాంతీయ విబేదం',
అయినా 'లవణం' గా కలసిపోగల 'యాసలలో నుడికారం',
'పులుపు'గా తెరపైకి వస్తున్న వైతాళికుల మనోభావం,
'చేదు'గా కూడా ఉంటుందని గుర్తుచేసిన "వికృతినామం",
ఈ షడ్రుచుల సోపానం ,
మళ్ళి దరిచేరినది నవ వసంత కోకిల గానం ,
చిగురించే గా సరికొత ఆశాభావం ,
రా ....రమ్మని పిలిచే 'రాజయోగం',
లేక్కలు రాకున్న ఎంతుందో తెలుపగల 'ఆదాయల వ్యయ్యం',
ప్రమయం లేకున్నా వెంటాడే 'అవమానం' ,
'నవరత్నా'లతో మారిపోవు 'జాతక చక్రం',
గడియ,విఘడియలు తేడా చేపగల "శ్రీ ఖరనామం" ,
మన 'భవిషవాణి' ఏమి పలుకునో కదా తెలుగు వారికే సొంతమైన -'ఉగాది పంచాంగం'.
ఉగాది శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)



















