Quote:
Thursday, March 13, 2014
Sunday, August 18, 2013
Sunday, July 21, 2013
కాశి పట్టణం చూడరా బాబు
కాశీ పట్నం చూడర బాబు
కాశీ పట్నం చూడర బాబు,
నేటి దుస్థితికి కారణం ఏవరు ?
ధర్మం విడనాడిన నాడు ,
ప్రకృతి వీలయ తాండవంలో 'విగత జీవి'గా మిగిలితివి చూడు ,
"నిజ భక్తి" లేక ముక్తి లభించదు ఎన్నడు ,
నిర్లక్ష్యం ఇకనైనా విడనాడ రా ..బాబు,
శక్తి పీఠాలుతోటే చేలగాటం ఆడే 'వెర్రితల' ఎలా పెంచుకొంటివి రా... నీవు??
||కాశీ ||
అ గంగమ్మా తల్లి మన తప్పు కాయునా ?
ఇక ఆ జంగమ దేవర! మన ప్రార్ధన వినునా?
నిర్మల భక్తి కనుమరుగైనది కదా నేడు,
సాధు, సంతులు లేని 'కేదారిని' చూడు,
నిజ తత్వ చింతన ఇంకెక్కడా దొరికును రా.. బాబు ?
పవిత్ర యాత్రను 'విహార' యాత్ర గా మార్చేసింది ..ఏవరు?
||కాశీ ||
'నేను' లోని అహం, 'నీవు' అనే సగం ,
కలగలసిన ఒక వైరాస్య తప్పిదం,
కాదు అనలేని కారణాలు అనేకం ,
కనుల ముందు నిలిచినా ఒక నిలువెత్తు నిదర్శనం.
-#RSR-
--------------------------o-o-o-o--- ------------------------------ --
Wednesday, June 26, 2013
Sunday, March 31, 2013
నీవు లేని వసంతోత్సవం
నీవు లేని వసంతోత్సవం
దరిచెరని ఓ! ప్రణయమా,
నీ తొడు లేని ఈ 'వసంతొ్త్సవం' ఎలా జరిగిందో నీకు తెలుసునా??
నా ఊపిరిలో నీ తలపు నింపగా,
'పచ్చని రంగు' అందుకు సాక్షిగా మొదటిగా నన్ను తాకింది,
నీ పేరు నే పిలువగా ,
నాలో నీ ఉనికిని చాటుతూ, 'గులారా' నా పెదవుల పై చేరింది,
నా కనుపాపలలో నీ రూపే మెదలాడగా,
ఈ నింగి,నేల అంతట నీవేనంటూ ..ఆ 'నీలి' రంగు నా పై చిరుజల్లై కురిసింది,
ప్రతి రంగులోను ,నీ పై నా 'ఆశ' జాలువారగా,
'ఇంద్రధనస్సు ' వలే నా మేను మెరిసింది,
నీవు లేక ,నీవు రాక ఈ వసంతం ఇలా గడచినా,
నిన్ను 'వలచి' ఒంటరినై నే మిగిలినా,
'గెలిచి' మరు జన్మలో 'పరువమై' నిన్ను చేరనా???
నూరేళ్ళ నేటి వసంతాలు,నాడు నావేనని తెలుపనా...ఓ ప్రాణమా!,దరిచెరని నా ప్రణయమా.
-#RSR-
Monday, December 24, 2012
మాయ భవిష్య వాణీ
నేను జీవించాలి అంటుకుంటే ,
ఈ ప్రపంచమే అంతిమ గడియలు లెక్కిస్తుంది అని మాయ భవిష్య వాణీ పలికింది ,
నేను నిస్తేజం అవ్వాలి అనుకుంటే,
ఆ మాయ లెక్కలు తేలేవరకు సెలవు లేదుంటున్నది,
ఈ మాయ ఏమో కాని ,
ఈ ప్రపంచమే అంతిమ గడియలు లెక్కిస్తుంది అని మాయ భవిష్య వాణీ పలికింది ,
నేను నిస్తేజం అవ్వాలి అనుకుంటే,
ఆ మాయ లెక్కలు తేలేవరకు సెలవు లేదుంటున్నది,
ఈ మాయ ఏమో కాని ,
కాలమనే అద్దం లో నన్ను నాకు సరి కోతగా చూపిస్తున్నది ,
జీవించాలి అనే భావనలో 'వికృతి రూపం' తోను,
నిస్తేజం అవ్వాలి అనే భావనలో 'ప్రశాంతమైన అందం' తో నా రూపం అగుపడుతున్నది.
జీవించాలి అనే భావనలో 'వికృతి రూపం' తోను,
నిస్తేజం అవ్వాలి అనే భావనలో 'ప్రశాంతమైన అందం' తో నా రూపం అగుపడుతున్నది.
Monday, September 3, 2012
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి
బృందావనంలో
నేడు 'కన్నయ్య' ఉంటాడని,
నమ్మి కొలిచేదరు ప్రతి ఇంటి ఇల్లవేల్పు నీవేనని,
ఉట్టి కొట్టిన,వసంత కేళి ఆడినా,
కస్తూరి తిలకం దిద్దిన, వెన్న ముద్ద లు నివేదించినా ,ఏటేటా నిన్నే దరిచేరి కొలిచినా,
" నన్ను" బంధింప గల అస్త్రం భక్తి తో నిండిన మీ 'మనసే' అని మాకు తెలియజేస్తూనే
తీరని తృష్ణ మా మనసులలో మిగిలి ఉంచగలిగే ,
దివ్య మనోహర రూపం నీదే కదా ఓ! నా స్వామి ?
మరి జాగుసెయ్యక ,మము తరింప చెయ్యగా రా....వేరా.. యమునా తటికి
ఓ ! మురారి ,మరో సారి ..

Friday, August 31, 2012
మరువరాని బంధం
నిన్ను చూస్తుంటే కవిత పొంగి పారేను ,
నీవు కానరాక పోతే...ఆ ఏరు నా
కన్నీరు అయ్యెను, నా ఏదో లోని భావాలన్నీ మల్లెలై విరబుసేను ,
నీ దోసిలిలో హారంగా చేరేవరకు అల్లాడి పోయేను,
నీవు చేరదీసిన వేల' "మనసైన బంధంగా'" ...
అల్లుక పోయేను,
నిరాధరణే నా భాగ్యమైన...ఎంతకి మిమ్ము వీడలేని...
...ఒక '"మరువరాని బంధం'" వోలె అనురాగ పరిమళానే సాధా నీకు పంచేను.
Monday, September 5, 2011
UGADI
రా... రామ్మనే యుగాదిసోయగం
'తియ్య'నైన తెలుగు పదం ,
అనాదిగా పంచుతున్నది మన పై మమ'కారం' ,
నేడు 'వగరు'గా అని పించే కదా 'ప్రాంతీయ విబేదం',
అయినా 'లవణం' గా కలసిపోగల 'యాసలలో నుడికారం',
'పులుపు'గా తెరపైకి వస్తున్న వైతాళికుల మనోభావం,
'చేదు'గా కూడా ఉంటుందని గుర్తుచేసిన "వికృతినామం",
ఈ షడ్రుచుల సోపానం ,
మళ్ళి దరిచేరినది నవ వసంత కోకిల గానం ,
చిగురించే గా సరికొత ఆశాభావం ,
రా ....రమ్మని పిలిచే 'రాజయోగం',
లేక్కలు రాకున్న ఎంతుందో తెలుపగల 'ఆదాయల వ్యయ్యం',
ప్రమయం లేకున్నా వెంటాడే 'అవమానం' ,
'నవరత్నా'లతో మారిపోవు 'జాతక చక్రం',
గడియ,విఘడియలు తేడా చేపగల "శ్రీ ఖరనామం" ,
మన 'భవిషవాణి' ఏమి పలుకునో కదా తెలుగు వారికే సొంతమైన -'ఉగాది పంచాంగం'.
ఉగాది శుభాకాంక్షలు

Tuesday, February 15, 2011
తెలుగుతల్లి కన్నీరు
తెలుగు తల్లి నేడు సందిగ్ధం లో ఉన్నది ,
ఎ ' బిడ్డ'కు ఎమోతుందో అని ఆరాటపడుతున్నది,
అన్నదమ్ముల ఈ పోరు మళ్ళి రేపింది ఎవరని?
నాటి భారత యుద్ధం తో నేర్చినది ఎమైనదని?
వీరులమన్న ,శురులమన్న ,బంధించిన తన ప్రేమ లో తేడాలేదన్నది ,
అన్నదమ్ములం నాడన్నా, ఉ ద్యమకారులం నేడన్న, పేరు మార్చి పిలుస్తున్న
- ఆత్మర్పనులు చేసుకున్న అన్యాయం జరిగేది తనకేనన్నది ,
ప్రయోజనం లేని ఉద్యమాల వల్ల ఒరిగేదేమున్నది ?
'స్వార్ధపరుల' ఓటమి ముందుంది చూడమన్నది
-----------సుధా రాణి .

నేస్తమా !ఇదే నీ వైనమా?
నేస్తమా !ఇదే నీ వైనమా?
-*-*-*-*-*-*-*-*-*-*-
స్నేహమనే సముద్రం లో నీవు ఒక చిన 'చేపవని ' అనుకున్నా,
అలల తాకిడికి నా తిరం చేరవనే భావించా,
కానీ రోజు నన్ను మరిచిపోయే నీ 'వైనం' జెల్లి ఫిష్తో పోలుస్తున్న,
అంది-అందని నీ స్నేహం' కొరమీను 'లా గుచ్చుతున్నదని చెబుతున్నా,
ఇతరులతో నన్ను పోల్చే నీ తిరు మదిలో అలజడులు రెపుతున్నా,
నిన్ను అద్దాల సౌదంలో ఉంచాలనే కోరుకున్న ,
అందుకే 'కాలమనే' చేపను, నీవు మింగేసినా నేను ఏమి చేయలేకున్నా,
సముద్రం మధ్య ఉండే నీకు, తిరం వెంబడి ఉన్న నాకు మధ్య 'దూరం' ఎంతో కొలవలేకున్నా,
సముద్రం మధ్య ఉండే నీకు, తిరం వెంబడి ఉన్న నాకు మధ్య 'దూరం' ఎంతో కొలవలేకున్నా,
వెనుదిరగాలని అనుకున్నా,నిరీక్షణం అర్ధం మారుతున్నా,
ఏదైనా వలలో చిక్కుకున్నావేమోనని దారి వెంబడి వెతుకుతున్నా,
ఏదైనా వలలో చిక్కుకున్నావేమోనని దారి వెంబడి వెతుకుతున్నా,
నేస్తమా! అని నీవు పిలిచావేమోనని అడుగు అడుగున ఇంకా ఆగుతున్నా.
-*-*-*-*-
Thursday, December 30, 2010
రోశయ్య -కిరణ్ కుమార్ ఎలెక్ట్ చేసినా కాంగ్రెస్ H.C
APది --నందో రాజ బవిషత్ ?????
ఆమ్మగారి కుటుంబం ఎప్పుడు ఒక వర్గం మాటే వింటుందట,
125 ఎళ్ళ అనుభవం ఈ రోజు మసకబరిందట,
అయినా A .P కాంగ్రెస్స్ కి ఏది అలవాటేనంట,
సంవత్సరానికి ఒక కొత్త C .M అవుతారంట,
లొపాభూయిష్టమైన ఈ ' చర్య' కాకుండా ఉంటే మంచిదంట ,
వ్యక్తి ఎవరైనా ప్రజలు మారోక మారు స్వాగతం పలుకుతున్నమాట .

CLP మీటింగ్ లో కిరణ్ కుమార్ ఎన్నిక వేల
జై హొ వై.యస్.ర్
ఊహించలేని పధకాలుమాకు కలిపించి,
అనింటా నీవు ముందుండి నడిపించి,
నేను ఉన్నాను అంటు పలకరించి ,
కనుమరుగైతివా 'వై.యస్ .ర్ ' మమ్ము మరిచి ,
నేడు C .L .P సమావేశం లో "న్యాయకత్వ లోపం" మాకు కనిపించి,
అయినా ఊరుకుంటిమి కదా, నీవు నమ్మిన కాంగ్రెస్స్ గౌరవించి,
Sunday, November 28, 2010
T-BYPOLL
తెలంగాణా లో బై-పోల్ పై నా అభిప్రాయం లో ఈ ఎన్నికలు
Congress :(1) కంగు తిన కాంగ్రెస్ ,
డమాల్ అన D .S
(2) కాకా, కేకే ,......యాష్కి లున్న కారడవి,
నేడు మృగరాజు లేక అయింది చిట్టిఅడివి .
TRS:
(1) కుతంత్రాలు ఎదురోడిన K .T .R ,
Ballet Box పద్మవ్యూహం చేదించలేక తడబడిన K .C .R
[Harish రావు వేరే వ్యక్తిని పెడుదాం అని అనుకున్నాడు K . T .R ప్లేస్ లో ఇవి ఇంటర్నల్ లెండి ]
(2)కోతులకు దొరికిన కోబరికాయ ,
ఎటు పరేస్తారో తెలియకున్నదయ్య.
T.D.P:
డిపాజిట్ గలంతు ఆయెన టి .డి.పి,
పునర్జ్మన పైన నమకం ఉండాలి అంటుంది రెండు వెళ్ళు చూపి.[Nagam ]
B.J.P:
బతికి ఉంటే బలిసాకు తినవచ్చు ఆనుకున బి. జ్. పి.
ఒక బలిసాకు(౧ seat) పోగేడిస్తూ తెప్పిస్తుంది తలనొప్పి.
PRP:
పాపం కాంటెస్ట్ ఏ చేయలేఖ పోయిన పి.ర్.పి.
వీరికే సామాజిక నయ్యం కావాలి అన్నుటుంది total A .P
*******************///**************************

బహుమతి

బహుమతి
'స్నేహం' అనే మైదానం లో ,
ఇద్దరు వ్యక్తుల పరగు పందెం లో ,
నీవు 'గెలువ' లేదు ,నేను 'ఓడ' లేదు ,
కానీ విరహం అనే "బహుమతిని " కాలం పంచి ఇచ్చింది--
--మన ఇద్దరికీ ఎందుకో మరి ?
బహుశా!, జీవితం అంటే గెలుపు ఓటములే కాదు అని--
-- చెప్పలుకుందో ఏమో మరి?
ఈ సత్యం నేను గ్రహించాను , మరి నీ సంగతి ఏమిటో మరి ???
భంధంలో నమ్మకం తప్పా,ఆలోచనకు తావు(chance) ఇవ్వకూడదు గా మరి?
అందుకే ఇకపై ఈ బహుమతి నీ "LOCKER "లో ' దాచేదమా'??
అయితే రెండో 'KEY' తవ్వారగా ఇవ్వు మరి.
భంధంలో నమ్మకం తప్పా,ఆలోచనకు తావు(chance) ఇవ్వకూడదు గా మరి?
అందుకే ఇకపై ఈ బహుమతి నీ "LOCKER "లో ' దాచేదమా'??
అయితే రెండో 'KEY' తవ్వారగా ఇవ్వు మరి.
Sunday, September 19, 2010
నీస్తమా నీవేక్కడా
నేస్తమా నీవేక్కడా!
___________
అలల వేగం నాదైతే బాగుండేది నీ జాడ తీరం చేరేందుకు,
ఆకస విహంగం నేను కాకపోతిని నీ క్షేమ సమాచారం -తెలుసుకునేందుకు,
నీ ఈ ముభావన ఎందులకో తెలియక తికమక పడుతున్న ప్రతిపూట,
అయినా కారణం అడగాలనే ఉంది నీలబడి నీ ఎదుట,
నీ గూర్చి ఆలోచిస్తూ అలసిపోతున్నా,
నిరీక్షణ విలువ ఏంటో తెలుసుకుంటున్నా,
అక్షర రూపంలో అదే తెలుపుతున్నా,
నీ సమాధానం రాకపోతే నా ఎదురితకు అర్ధం లేదని మరొకమారు -చెప్పే ప్రయత్నం చేస్తున్నా,

Subscribe to:
Posts (Atom)