నిండైన అమ్మమ్మ చీర కట్టు,నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు,
మనసు లాగేసరో! అమ్మ చేతి అరిసెల, జంతికల చుట్టు,

పెరడులో విరగబూసిన కారపుబంతి చెట్టు,
బంధుత్వాల కలగలుపులో బావ,మరదలిదే సరైన జట్టు ,

వెరసి అనిపించే కదా ! సిరిసంపదల నిలయం మా ఇల్లే అనేట్టు ,
'పల్లె ' గాలి పిలిచే పద పదమని అల్లరి చేసేట్టు ,

పడుచు అందాలు కనువిందు చేసే కదా ! అడుగులు తడబడెట్టు,
కోడి పందాలు సాగే మా పౌరుషాల రుచి చూపెట్టు ,

ఇన్నాళ్ళ పేచిలు ఇక ఈ పతంగితో పెంఛ్ః కట్టు,
ఊరు వాడ దద్దరిల్లే కదా ! "జోష్ " అంటే కుర్రకారుదనేట్టు ,
ఈ సరదా సంక్రాంతి ఏదో మాయ చేసేరా ?....... అందరిని ఊరు చేరేట్టు.

-RSR-
1 comment:
Nice
Post a Comment